వేద న్యూస్, వరంగల్ క్రైమ్ :

ఎల్కతుర్తి ఎస్ఐగా తాజాగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ ను ఎల్కతుర్తి మండల వివిధ పార్టీల నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎల్కతుర్తి సబ్ ఇన్ స్పెక్టర్‌గా బదిలీపై వచ్చిన ప్రవీణ్ కుమార్ కు స్వాగతం పలికారు. పోలీస్ అధికారిగా ప్రజల్లో చక్కటి పేరు సంపాదించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు కుడితాడి రాజు, హింగె సంతాజీ, రామారావు, హింగె భాస్కర్, సుకినె సుధాకర్ రావు, అంబీరు శ్రీనివాస్, ఎనకమూరి చందర్‌రావు పాల్గొన్నారు.