వేద న్యూస్, వరంగల్:
హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామంలో చెన్నకేశవ స్వామి సమీపంలో సుమారు 4ఎకరాల లో బాలామానసాదేవి సహిత ద్వాత్రిమృద్ధణపతి దేవాలయానికి భూమిపూజ పీఠ అధిపతి లక్ష్మి నారాయణ గురు భవాని ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య , టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎల్ దొమ్మటి సాంబయ్య లు హాజరయ్యారు. అనంతరం దేవాలయ నిర్వాహకులకు ఘనంగా సన్మానం చేశారు.

పీఠ అధిపతి లక్ష్మి నారాయణ గురు భవాని మాట్లాడుతూ భక్తి మార్గంలో ప్రశాంతత ఉంటుందని చెప్పారు. దైవ చింతనతో ప్రశాంతత లభిస్తుందని వెల్లడించారు. బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో బాల మానసా మహా విద్యా పీఠం కో శా ధి కారి వనిత అరుణ్ దంపతులు, విద్యా పీఠం వారు తదితరులు పాల్గొన్నారు.