వేద న్యూస్, వరంగల్:

కమర్షియల్ బ్యాంక్‌లకు ధీటుగా డీసీసీ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయని పెద్దాపూర్ పీఏసీఎస్ చైర్మన్ బోల్లు రాజు పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పసరగొండ గ్రామానికి చెందిన నల్లెల రాజబాబు భార్య హేమలత ఇటీవల మృతి చెందారు. ఆమెకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) కింద రూ.2 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు మంజూరయ్యాయి. 

ఇందుకు సంబంధించిన చెక్కును పీఏసీఎస్ చైర్మన్ రాజు హేమలత కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు.  కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజు, డీసీసీబీ ఆత్మకూరు మేనేజర్ హరిత, అసిస్టెంట్ మేనేజర్ ఫైయాజ్, సీఈవో లు శ్రీనివాస్, ఓం రెడ్డి, లక్మయ్య, రాజేష్, సూపర్‌వైజర్, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.