వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి :
వేళ కాగడాలు ఏకమైతే లక్ష గొంతులు ఒక్కటైతే కోటి ఆశలు నిలువెల్లా నింపుతుంటే అతనొక్కడౌతాడు జాతి ఆత్మగోషను గుండెల నిండా నింపుకొని పుట్టినవాడు తెల్ల దొరల ముందు మీసం మేలేసిన పౌరుషాగ్ని ఉరికొయ్యలను ముద్దాడిన స్వతంత్ర సమరయోధులు మహాయోధులు షాహిద్ భగత్ సింగ్ రాజు గురు సుఖ్ దేవుల మహనీయుల వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలని ఏ ఐ వై ఎఫ్ అఖిల భారత యువజన సమాఖ్య డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిరావత్ లింగా నాయక్ అన్నారు.ఆదివారం భగత్ సింగ్ సుఖ్ దేవ్ రాజ్ గురు వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మిర్యాలగూడ సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధీరవత్ లింగా నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహనీయులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు భారత స్వతంత్ర చరిత్రలో అరుణ తారలని లింగా నాయక్ కొనియాడారు. భారతదేశ స్వతంత్ర సాధనకు ఎందరో మహానుభావులు తమ ప్రాణాల ను నునుగు మీసాల వయసులోని త్యాగం చేశారని గుర్తు చేశారు.నాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి ప్రాణాలు సైతం లెక్కచేయలేదని పేర్కొన్నారు. నేటి తరం యువత ప్రతి ఒక్కరు మహా యోధులు భగత్ సింగ్, రాజ్ గురు,సుఖ్ దేవుల బాటలో నడవాలని లింగ నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సిపిఐ మండల కార్యదర్శి ఎండిసయ్యద్,వేములపల్లి మండల కార్యదర్శి జిల్లాయాదగిరి,దళిత హక్కుల పోరాటసమితి రాష్ట్ర నాయకులు వలoపట్లవెంకన్న,దామరచర్ల సహకార కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్,నరసమ్మ, విజయమ్మ,అలివేలు,నాగమ్మ, జయ,జయమ్మ తదితరులు పాల్గొన్నారు.