వేద న్యూస్, వరంగల్ జిల్లా :

పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని జిడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే నేడొక ప్రకటన లో నగర ప్రజలను కోరారు.ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరపు పన్నులు చెల్లించడానికి కేవలం 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. నగరావాసుల సౌకర్యార్థం గ్రేటర్ వరంగల్ నగర పరిధి లో ఉన్న 10 ఈ-సేవా కేంద్రాలైన కాజీపేట సర్కిల్ కార్యాలయం, సుబేదారి వాటర్ ట్యాంక్, హన్మకొండ నక్కలగుట్ట వాటర్ ట్యాంక్, హన్మకొండ అశోకా హోటల్ ఎదురుగా గల మీ సేవా కేంద్రం, హన్మకొండ నయీంనగర్ , హన్మకొండ బల్దియా ప్రధాన కార్యాలయం, వరంగల్ పోచమ్మమైదాన్ ఈ సేవా, వరంగల్ కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయం, వరంగల్ హెడ్ పోస్టాఫీసు, వరంగల్ కరీమాబాద్ ఈ సేవా కేంద్రం,వరంగల్ లతో పాటు జీ డబ్ల్యు ఏం సి యాప్ ద్వారా గాని www.gwmc.gov.in ద్వారా గాని QR కోడ్ ద్వారా గాని మీ సమీపం లో గల మీ సేవా కేంద్రాల్లో, వార్డ్ ఆఫీసర్లకు పన్నులు చెల్లించవచ్చని తెలిపారు. సుధీర్ఘ కాలంగా పన్నులు చెల్లించని వారికి ఇప్పటికే రెడ్ నోటీసు లు అందించి ఆస్తులను జప్తు చేస్తున్నామని, రెసిడెన్షియల్ , కమర్షియల్ పన్ను చెల్లింపు దారులు వెంటనే పన్నులు చెల్లించాలని, లేనిచో ఆస్తుల్ని సీజ్ చేస్తామని ఈ సందర్భం గా కమిషనర్ హెచ్చరించారు.