వేద న్యూస్, వరంగల్:
రేషన్ కార్డుల సర్వే నుంచి పంచాయతీ కార్యదర్శులకు మినహాయింపు ఇవ్వాలని పంచాయతీ సెక్రెటరీలు కోరారు. ఈ మేరకు వారు బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండల ఎంపీడీవో కల్పనకు వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు అందరూ వేసవి నేపథ్యంలో తాగు నీటిసరఫరా, ఎల్ఆర్ఎస్ సర్వే , ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపు సర్వే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్నులు 100% వసూలు , ఉపాధి హామీ పనులు చేపట్టడం, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో భాగంగా అందరూ ఇప్పటికే పని భారంతో విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. కొత్తగా సెక్రెటరీలకు రేషన్ కార్డుల సర్వే అప్పగించడం అదనపు భారం అవుతుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల సర్వే నుంచి పంచాయతీ కార్యదర్శులకు మినహాయింపు ఇప్పించాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీవో రంగాచారి, పంచాయతీ కార్యదర్శుల ఫోరం హనుమకొండ జిల్లా కార్యదర్శి ఇంజపెల్లి నరేష్,ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ శంకర్, పరకాల డివిజన్ అధ్యక్షుడు వేణు మాధవ్,కార్యదర్శులు సరళ, వేణుమాధవ్, కవిత తదితరులు పాల్గొన్నారు.