వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి :
పేద ప్రజల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని ఏఐసీసీ సభ్యులు రాoరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వీణారెడ్డి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం పెన్ పహాడ్ మండల కేంద్రంలోని అనాజిపురం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపునిండా భోజనం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికి ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నేరవేరుస్తూన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసి చూపెట్టారని వారు స్పష్టం చేశారు.
గతంలో రేషన్ బియ్యం పంపిణీలో మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు. గత పది సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తుందని పేర్కొన్నారు. సందర్భంగా సన్న బియ్యం పంపిణీ పథకం ప్రజలకు కలిగించే ప్రయోజనాలను వివరించారు.
పేద ప్రజలకు పోషకాలతో కూడిన నాణ్యమైన బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చారిత్రక పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. ఈ పథకం చారిత్రకమని, ఇది రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తుందని తద్వారా పేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి, మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు, పెన్ పహాడ్ మండల పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు, కోటేశ్వరరావు రేషన్ డీలర్ తదితరులు పాల్గొన్నారు.