వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి :
2023 నవంబర్ నెలలో కోదాడ పట్టణంలో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం సేకరించి పేకాటరాయుళ్లను అరెస్టు చేసి 68 వేల రూపాయలు సీజ్ చేసి కేసు కోర్టుకు పంపడం జరిగినది. సీజ్ చేసి కోర్టుకు పంపిన 68 వేల రూపాయల నగదులో 34 వేల రూపాయలు పోలీసులకు రివార్డ్ గా ఇస్తూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగినది. దీనిలో బాగా పని చేసిన అప్పటి ఇన్స్పెక్టర్ రాము, ఎస్ ఐ రామాంజనేయులు, కానిస్టేబుల్స్ ఆంజనేయులు, సతీష్, వెంకటేశ్వర్లు, శ్రీనులకు రివార్డ్ అమౌంట్ ను జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ అందించారు.