వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి :

సూర్యాపేట బిఆర్ ఎస్ పార్టీ నాయకులు వెన్న రవితేజ రెడ్డి తమ్ముడు వెన్న నిఖిల్ రెడ్డి చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత భాధాకరమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు కాసరబాద్ సమీపంలోని వారి వ్యవసాయ క్షేత్రం లో వెన్న నిఖిల్ రెడ్డి ప్రథమ వర్దంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని, స్మారక వనాన్ని జగదీష్ రెడ్డి ప్రారంభించారు. నిఖిల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెన్న నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు ఆయన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిఖిల్ రెడ్డి తల్లిదండ్రులు వెన్న సతీష్ రెడ్డి మాధవిలు, సోదరుడు రవితేజ రెడ్డి లు పాల్గొని నిఖిల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ నాయకులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, గండూరి ప్రకాష్, ఆకుల లవకుశ, ఉప్పల ఆనంద్, మొరిశెట్టి శ్రీనివాస్, జీడి భిక్షం, నెమ్మది భిక్షం, సవరాల‌ సత్యనారాయణ, తహెర్ పాషా, బూర బాలసైదులు, వల్దాసు జాని, బత్తుల జాని, గాలి సాయి కిరణ్, ఈదుల యాదగరి, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.