వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణం వన్ టౌన్..టూ టౌన్ పరిధిలో డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో మొత్తం 43 మంది యువకులను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.వారి వద్ద నుంచి 21 బైకులను స్వాధీన పరుచుకున్నారు.

అనుమానాస్పదంగా ఉన్న ద్విచక్ర వాహనాల పైన మరియు గతంలో గంజాయి మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వ్యక్తులు ఉన్నట్లయితే వారి పైన కేసు నమోదు చేస్తామని, సరైన పత్రాలు లేని బైక్లను సీజ్ చేస్తామని, బైక్ నెంబర్లను ట్యాంపరింగ్ చేసినట్లయితే చీటింగ్ కేసు నమోదు చేస్తామని, సైలెన్సర్లు తీసేసి ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేస్తామని హెచ్చరించారు.

రోడ్లపై మద్యం తాగి విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులను గురి చేసిన వాళ్లకు తగిన శిక్షలు అమలు చేస్తామని పత్రికముఖంగా డిఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు.అదుపులో ఉన్న యువకులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని మరొకసారి చట్టా వ్యతిరేకచర్లకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో ఎక్కడైనా పేకాట,గంజా క్రికెట్ బెట్టింగ్ జరిగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,బెట్టింగ్ పాల్పడిన,సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు.నెంబర్ లేకుండా లేదా వాహనాలను పెద్ద చప్పుడుతో నడిపిన వారు శిక్షార్హులు అన్నారు.

లైసెన్సు లేనివారికి శిక్షపడుతుందని అన్నారు.యువత తల్లిదండ్రులు మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని అన్నారు.విద్యార్థులు చదువుకొని మంచి భవిష్యత్తు అందుకోవాలి చెడు వ్యసనాలకు దగ్గర కావొద్దు అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో సిఐలు ప్రసాద్, మోతిరాం, సామ నర్సయ్య, ఎస్సైలు కృష్ణయ్య, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, సైదిరెడ్డి, బిక్షం లతో పాటు కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.