వేద న్యూస్, వరంగల్:
వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలలో బతుకమ్మ సంబరాలు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ చంద్రమౌళి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కళాశాలలోని మూడు ఎన్ఎస్ఎస్ యూనిట్స్ విద్యార్థులకు బతుకమ్మను తయారు చేసే పోటీని నిర్వహించారు. ఈ పోటీలను వీక్షించిన కళాశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తెలంగాణలో జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే జరుపుకునే అన్ని పండుగల కన్నా గొప్ప పండుగగా ప్రసిద్ధి చెందిందని చెప్పారు.

బతుకమ్మలో పేర్చిన పువ్వుల విధంగా మీ జీవితం కూడా రంగుల మయం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మలు పువ్వులు పేర్చిన విధంగా మీ జీవితం కూడా క్రమశిక్షణమయంగా ఉండి..అన్నిటికంటే ఎత్తులో పెట్టిన అమ్మవారి మీ జీవిత లక్ష్యం కూడా ఉండాలని ఆశీస్సులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పార్వతి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ వచ్చిన విధానాన్ని మరియు బతుకమ్మలో పేర్చి ఒక్కొక్క పుష్పాల గురించి వివరించుచు సైంటిఫిక్ గా బతుకమ్మ ఉపయోగాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు.

ఎన్ఎస్ఎస్ మూడు యూనిట్ల ప్రోగ్రాం ఆఫీసర్స్ కే. రాజేశ్వరి, మంగమ్మ, డి. రాధిక, అధ్యాపక బృందమంతా విద్యార్థులతో కలిసి ఆనందోత్సాహాలతో బతుకమ్మను ఆడారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి సుహాసిని, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ డి.పార్వతి, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి. రామకృష్ణారెడ్డి, డాక్టర్ జి. రేణుక, అధ్యాపకేతర బృందమంతా పాల్గొన్నారు. విద్యార్థినులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు.