వేద న్యూస్, సుల్తానాబాద్:
సుల్తానాబాద్ మున్సిపాలిటీలో పెరిగిద్ద హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ సినిమాస్ మేనేజ్మెంట్ వారు ఆదివారం అన్నదానం నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీరామ సినిమాస్ ఆధ్వర్యంలో పెరిగిద్ద హనుమాన్ దేవాలయంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సైతం అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి వారే చూసుకున్నారు. స్వయంగా యాజమాన్యం వారు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ సినిమాస్ వారికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.