వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి : 

జనయేత్రి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా మిర్యాలగూడ లోని తన కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఎంతో మంది రక్తదాతలు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసినట్లయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడవచ్చు అనీ మంచి సామాజిక స్పృహతో.డా.మునీర్ అహ్మద్ షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అభినందనలు తెలుపుతూ డిఎస్పి రాజశేఖర్ రాజు సమక్షంలో అంబేద్కర్ యువజన సంఘం మిర్యాలగూడ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దైద శ్రీనివాస్,పురం వెంకట్, దైద సంజయ్ కుమార్,సామాజిక కార్యకర్త కొత్తపల్లి సైదులు,నందిపటి నరేష్,దైద శరత్ కుమార్,పవన్ లు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.