వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ:
నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నెక్కొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం నర్సంపేట మాజీ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఎట్ల నర్సయ్య, చెవ్వ సూరయ్య, సంపత్ తదితరులున్నారు. వారదందరికీ మాజీ ఎమ్మెల్యే దొంతి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం దొంతి మాధవ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో రోజు రోజుకూ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందని చెప్పారు. విజయభేరి సభలో సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలను గడపగడపకు అందిస్తామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దొరల ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు భక్కి అశోక్, ఆ పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ పట్టణ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రావుల మహిపాల్ రెడ్డి, ముదిగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.