వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :

మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్ముడబోయిన అర్జున్ తన సొంత గ్రామమైన సల్కునూరులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి కృషిచేసి విగ్రహావిష్కరణ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వాడవాడనా ఏర్పాటు చేసి అంబేద్కర్ చేసిన సేవలను ప్రతి ఒక్కరికి తెలియాలి అన్నాడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశాడని అలాగే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ,బీసీలు చట్టసభలలో పొందుతున్న రిజర్వేషన్లు అంబేద్కర్ పున్యమే అని ఆయన అన్నారు.అంబేద్కర్ భారతదేశ ప్రజల ఆరాధ్య దైవం అని కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనాన్ని, కుల వివక్షత రూపుమాపడానికి ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి అలాగే బడుగు బలహీన వర్గాలు అందరికీ ఓటు హక్కు కల్పించేలా కృషి చేసిన వ్యక్తి,బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు అందరూ స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మాజీ జడ్పిటిసి తండు సైదులు గౌడ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్, నాయిని భాస్కర్,అంజి గౌడ్, వీటి,రాంబాబు,శ్రీనివాస్, చిర క్రాంతి,ఉపేందర్,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.