•  పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి చింతకుంట సమక్షంలో..
  •  హస్తం పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచన

వేద న్యూస్, సుల్తానాబాద్:
కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసిన తొలి జాబితాలో పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ చింతకుంట విజయ రమణ రావు పేరు ఖరారైంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వంలో చింతకుంట దూసుకెళ్లేందుకు బయల్దేరారు. ఆయన సమక్షంలో బీఆర్ఎస్‌ పార్టీ సుల్తానాబాద్ పీఏసీఎస్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, డైరెక్టర్లు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ చింతకుంట కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమలో శ్రీగిరి శ్రీనివాస్ (కేడీసీసీ జిల్లా బ్యాంక్ డైరెక్టర్, సుల్తానాబాద్ పీఏసీఎస్ చైర్మన్) సుల్తానాబాద్ పీఏసీఎస్ సింగిల్ విండో డైరెక్టర్లు కూకట్ల ఓదెలు, మేకల రాజయ్య, బండ గోపాల్ యాదవ్, పోతర్ల కమలమ్మ -రాజయ్య, నాయకులు మారావేణి లచ్చయ్య యాదవ్ (మాజీ వార్డు సభ్యులు, పూసాల) నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.