- మహేందర్ కుమార్ను కలిసిన మహిళా నేతలు
వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి/గోషామహల్:
గోషామహల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ తెలంగాణ ఉద్యమనేత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ వీ మహేందర్ కుమార్ కు ఇస్తే..ఆయన గెలుపునకు కృషి చేస్తామని మహిళా నేతలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ భవన్ నుంచి పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ చేసే గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ప్రకటన కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
21 ఏండ్లుగా బీఆర్ఎస్ పార్టీ కోసం సైనికుడిగా పని చేస్తోన్న ఆర్ వీ మహేందర్ కుమార్ టికెట్ కన్ఫర్మ్ చేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంలో టికెట్ కన్ఫర్మ్ అనే ధీమా కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. గోషామహల్ రోజు రోజుకూ ఆర్ వీ మహేందర్ కు ఆదరణ పెరుగుతున్నదని చెప్పారు. ఇప్పటికే ప్రగతి భవన్ వేదికగా పలుమార్లు మంత్రి కేటీఆర్ తో మహేందర్ కుమార్ సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే బీసీ నేతగా పేరు సంపాదించుకున్న ఆర్ వీ మహేందర్ కు టికెట్ విషయమై పార్టీ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మహేందర్ కు పార్టీ టికెట్ కేటాయిస్తుందనే సమాచారంపై ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గోషామహల్ లో బీఆర్ఎస్ గెలుపునకు అందరం కలిసికట్టుగా పని చేస్తామని చెప్తున్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం., గోషామహల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరం సైనికుల్లా పని చేస్తామని గులాబీ పార్టీ నేతలు హామీనిస్తున్నారు. ఇతర పార్టీ నేతలకు టికెట్ వస్తుందనేది అసత్య ప్రచారమని అంటున్నారు. పార్టీ అదేశాలు, సీఎం కేసీఆర్ సలహాలు, సూచనల మేరకు తామంతా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసం.. గోషామహల్ లో బీఆర్ఎస్ ను గెలిపించి సీఎం కేసీఆర్ కు బహుమతిగా అందిస్తామని ప్రకటించారు. ఆర్ వీ మహేందర్ కుమార్ ను కలిసిన వారిలో మహిళా నేతలు బండారు లత, కోటం పద్మ, లీల, జంగం పద్మ, స్వాతి తదితరులున్నారు.