- ఎమ్మెల్యే దాసరి గెలుపు ఖాయమని బీఆర్ఎస్ నేతల ధీమా
వేద న్యూస్, సుల్తానాబాద్:
సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని 5వ వార్డు గులాబీమయంగా మారింది. ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డిని గెలిపించేందుకు గురువారం 5వ వార్డ్ కౌన్సిలర్ జ్ఞానేశ్వరి గుణపతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. వారు ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ మేనిఫెస్టోను, అమలుపరిచిన సంక్షేమ పథకాలను వివరించారు.
ఈ ప్రచారానికి ప్రజల్లో మంచి ఆదరణ లభించిందని నాయకులు తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డి గెలుపు మరోసారి ఖాయమని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు ముత్యం రమేష్, ఐల రమేష్, సూర్య శ్యామ్, నల్లవెల్లి ఎల్లయ్య, విజ్జగిరి సంజీవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.