వేద న్యూస్, ఎల్కతుర్తి:

ఎల్కతుర్తి మండలంలోని గ్రామపంచాయతీ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మంచి నీటి కోసం కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ ..తన సొంత నిధులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సదరు బోరు బావిని మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ప్రారంభించారు. 

 

కార్యక్రమంలో  అక్కన్నపేట మండల బీజేపీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, హుస్నాబాద్ రూరల్ మండల్ అధ్యక్షులు సంపత్ నాయక్, సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, జనగాం కిష్టయ్య, ఆడపు శ్రీ వర్ధన్, నాంపల్లి అశోక్ మామాజీ సర్పంచులు
బూర్గుల రామారావు, శ్యామల సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.