- మహా శక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సురేందర్ రెడ్డి
- బండికి శుభాకాంక్షలు తెలిపిన జేఎస్ఆర్
వేద న్యూస్, హుస్నాబాద్:
కరీంనగర్ లోని మహా శక్తి ఆలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను వృక్ష ప్రసాద దాత, బిజెపి హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి (జేఎస్ఆర్) మర్యాదపూర్వకంగా కలిశారు.
బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం విడుదల చేసిన తొలి జాబితాలో కరీంనగర్ అసెంబ్లీ స్థానాన్ని బండి సంజయ్ కి కేటాయించడం పట్ల జె ఎస్ ఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.