వేద న్యూస్, ఎలిగేడు:
ఆదివారం ఉదయం బిజెపి ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాలో పెద్దపెల్లి లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుండగా బిజెపి మాత్రం వేచి చూస్తున్నట్లు కనబడుతుంది.
పెద్దపల్లీలో బిజెపికి ఆశావాహులు ఎక్కువగా ఉండడం, ఇతర నేతల గురించి ఆలోచించడం వంటివి దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీ అధిష్టానం వేచి చూస్తున్నట్టు కనబడుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే విషయమై ఇంకా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.