- దాసరి సమక్షంలో పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ మల్లేశం, యువకులు
- కారు జోరుకు హస్తం బేజారు!
వేద న్యూస్, ఎలిగేడు:
ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మీసారగండ మల్లేశం, యువకులు హన్మంతు, బొంతల లక్ష్మయ్య, గుడుగుల రాజేశం, గుడుగుల చీన్న రాజేశం.. పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం వారందరికీ గులాబీ పార్టీ కండువా కప్పి వారినికి పార్టీ లోకి దాసరి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ మనోహర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలోకి వచ్చినట్టు చెప్పారు. కార్యక్రమంలోఎంపీపీ తానిపర్తి స్రవంతి – మోహన్ రావు, మండల పార్టీ అధ్యక్షులు బైరెడ్డి రాంరెడ్డి, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు కప్పల ప్రవీణ్, కవ్వంపల్లి బాపయ్య, కనుకుంట్ల చంద్రయ్య, గొస్కె తిరుపతి, రాజేశం, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.