• 17న ‘అటవీ సందర్శన’ కార్యక్రమం
  • పర్యావరణ ప్రేమికులు పాల్గొనాలని పిలుపు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/హన్మకొండ:

అటవీ శాఖ, హన్మకొండ, జన విజ్ఞాన వేదిక, హన్మకొండ, పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక(యూనైటెడ్ ఫోరమ్ ఫర్ ఎన్విరాన్ మెంటల్  ప్రొటెక్షన్ వరంగల్) వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 17న(ఆదివారం) ‘అటవీ సందర్శన’ (ఇనుపరాతి గట్టు అడవి ట్రెక్) కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సంస్థ బాధ్యులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేశారు. ప్రకృతి /పర్యావరణ ప్రేమికులు, వారి కుటుంబ సభ్యులు తమ సొంత వాహనాల్లో ఉదయం 7 గంటలకు జెడ్పీహెచ్ఎస్ దేవునూర్ వద్దకు హాజరు కావాలని సూచించారు.

ట్రెక్ తర్వాత అటవీ శాఖ సౌజన్యంతో చిరు భోజనం ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 7గంటలకు ధర్మసాగర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ దేవునూర్ లో సమావేశంఉంటుందని స్పష్టం చేశారు. పరిచయ కార్యక్రమం తర్వాత 8 గంటల నుంచి 11 గంటల వరకు అటవీ నడక/ట్రెక్.. 11 గంటల నుంచి 2 గంటల వరకు, ‘ఇనుపరాతి గట్టు అడవి సంరక్షణ’ కోసం చర్చా గోష్టి ఉంటుందని వెల్లడించారు.

12 నుంచి 1 గంటల వరకు మధ్యాహ్నం చిరు భోజనం..ఆ తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ‘అటవీ నడక’ కార్యక్రమంలో పాల్గొనే వారు వాకింగ్ షూస్, నీళ్ల బాటిల్, చేతి సంచి, ప్లేట్, గ్లాస్ , హ్యాట్, స్కార్ఫ్/ రుమాలు వెంట తీసుకొచ్చుకొవాలని సూచించారు.

ముదురు రంగు, గ్రీన్ లేదా బ్రౌన్ డ్రెస్ ధరించి..కెమెరా, బైనాక్యులర్స్ ఉన్నట్లయితే తీసుకురావచ్చని స్పష్టం చేశారు. రవాణాకు సొంత వాహనాలు తీసుకొచ్చుకోవాలని, ఎంట్రీ ఫీ లేదని చెప్పారు. దాతలకు ప్రోత్సాహం కలదని, ఈ విషయమై ఏదైనా సందేహం వస్తే విచారణకు 83280 26266, 99897 32423 నెంబర్లను సంప్రదించవచ్చునని యూఈఈపీ బాధ్యులు కాజీపేట పురుషోత్తం, జేవీవీ బాధ్యులు ధర్మ ప్రకాష్ తెలిపారు.