వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బీ రమేష్ అధ్వర్యంలో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు., అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటం లో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను, వారి సేవలను కొనియాడారు.
అనంతరం కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన సాంస్కృ తిక పోటీలలో గెలుపొందిన విద్యార్థిని,విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు . కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీ రమేష్ , డాక్టర్ ఓదెల్ కుమార్ , డాక్టర్ రాజేంద్రం, డాక్టర్ కె గణేష్ , డాక్టర్ మాధవి, ఉమా కిరణ్ , డాక్టర్ రవి, పీ శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.