వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మండలకేంద్రానికి చెందిన జర్నలిస్ట్ శ్రీకుమార్ మాతృమూర్తి మూడ్ సీత(శాంతి) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మరిపెడ మండల టీయూడబ్ల్యూజే(ఐజేయూ)జిల్లా, మండల నాయకులు, స్థానిక జర్నలిస్ట్‌లతో కలిసి శ్రీకుమార్ ను వారి కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించి ఓదార్చారు.

సీతమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు. శ్రీకుమార్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.