వేద న్యూస్, మరిపెడ:
ప్రతీ ఒక్కరు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని జేవీవీ నాయకులు అభిప్రాయపడ్డారు. సోమవారం సీతారాంపురం పాఠశాల లో పాఠశాల స్థాయి చెకుముకి ప్రశ్నాపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. చెకుముకి పాఠశాల స్థాయి ప్రారంభోత్సవంలో ప్రధానోపాధ్యాయులు రామచంద్రు మాట్లాడారు. ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగే చెకుముకి సైన్స్ సంబురాలు పాఠశాల స్థాయి మరిపెడ మండలంలోని సీతారాంపురం పాఠశాలలో జరుగుతున్నట్లు తెలిపారు.

ఉన్నత పాఠశాల లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రామచంద్రు ప్రశ్నాపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని, శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడంలో, జేవివి కృషి అభినందనీయమని ప్రశంసించారు.

జేవీవీ మండల అధ్యక్షులు బయగాని రామ్మోహన్ మాట్లాడుతూ 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించి, 27న జరిగే మండల స్థాయి పరీక్షకు ప్రతీ పాఠశాల నుండి ఎంపికైన ముగ్గురు విద్యార్థుల..మండల స్థాయికి పంపిస్తామని వివరించారు.

అనంతరం మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు జిల్లా స్థాయికి పంపబడతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేవీవీ బాధ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.