వేద న్యూస్, జమ్మికుంట :

జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన సిరిసేటి వంశీ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన రాచపల్లి వెంకటేష్ అనే యువకుడు బీర్ బాటిల్ తో దాడి చేయగా వంశీ తలకు గాయాలైనట్లు వంశి తండ్రి సిరిసేటి వెంకట మల్లయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన జమ్మికుంట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు.

సీఐ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన సిరిసేటి వంశీ..నాగంపేట గ్రామంలోని వైన్ షాప్ వద్దకు బీర్ల కోసం వెళ్లాడు. అక్కడే ఉన్న విలాసాగర్ గ్రామానికి చెందిన రాచపల్లి వెంకటేష్ అనే వ్యక్తి పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని వంశీ పై  బీర్ బాటిల్ తో దాడి చేసి గాయపరిచినట్లు తెలిసింది. వెంటనే గాయపడ్డ వంశీని పట్టణంలోని ఒక ప్రైవేట్ హాస్పటల్ కు తీసుకువెళ్లి వైద్యం చేయించారు. డాక్టర్లు తలకు కుట్లు వేసినట్లు గాయపడ్డ వంశీ తండ్రి వెంకట మల్లయ్య తెలిపారు.