- అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం ఘట్కేసర్ మండల అధ్యక్షుడిగా వంగూరి జంగయ్య
వేద న్యూస్, మేడ్చల్:
అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం(ABABS) మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల శాఖ అధ్యక్షుడిగా వంగూరి జంగయ్యను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వంగూరి జంగయ్య మాట్లాడుతూ నిత్యం అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
తనను మండల శాఖ అధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.