వేద న్యూస్, వరంగల్:
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో దుబ్బాసి దంపతులు శుక్రవారం అభిషేకం నిర్వహించారు. ఈ నెల 8న శ్రీ దేవి-భూదేవి సమేత చెన్న కేశవ స్వామికళ్యాణ మహోత్సవం ఘనంగా జరపనున్న నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్నారు.
శనివారం కన్నుల పండుగగా జరిగే చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రజల అధిక సంఖ్యలో ..సకుటుంబ సపరివారం సమేతముగా విచ్చేసి, స్వామి వారి ఆశీర్వాదములు, తీర్థప్రసాదములు స్వీకరించాలని దుబ్బాసి మానస నవీన్ పిలుపునిచ్చారు. భక్తులకు స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా అన్నదానం చేయబోతున్నట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. మహిమాన్వితమైన శ్రీ చెన్నకేశవ స్వామి వారిని అందరూ దర్శించుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మార్గదర్శనంలో భక్తి మార్గంలో ముందు కి వెళ్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత ఉరుకుల పరువుల జీవనంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన అత్యవసరమని, దైవచింతనతో ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.