•  రూ.40 వేలు లంచం తీసుకుంటూ..

వేద న్యూస్, వరంగల్:
లంచం తీసుకుంటూ ఏసీబీకి పోలీస్ ఉద్యోగి పట్టుబడ్డారు. ఒక కేసులో ముగ్గురు నిందితులకు స్టేషన్ బెయిల్ మంజూరుకు రూ.40 వేలు లంచం తీసుకుంటూ..వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పర్వతగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ (ఎస్ హెచ్ వో) జి.వెంకన్న ఏసీబీ ఆఫీసర్లకు చిక్కారు. తన డ్రైవర్ పి.సదానందం ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.