వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో వరంగల్ డివిజన్ లో పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన పరీక్ష కేంద్రాలను ఇంతేజార్ గంజ్ సీఐ మచ్చ శివకుమార్ తో కలిసి పరిశీలించారు. పరీక్షా కేంద్రాల పరిసరాలలో సెక్షన్ 144 అమలు లో ఉన్నందున పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ప్రజలు గుంపులు ఉండకుండా జాగ్రత్త పడాలని అలాగే అనుమతులు లేకుండా సభలు సమావేశాలు నిర్వహించడం చేయరాదని అన్నారు.
ముఖ్యంగా పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రాల పరిసరాలను నో సెల్ ఫోన్ జోన్ గా పరిగణలోనికి తీసుకుపోవడంతో పాటు పరీక్షా కేంద్రం పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని, ముఖ్యంగా సీసీ కెమెరాల పనితీరుపై సంబందిత పరీక్షా కేంద్రం సిబ్బంది,అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఏసీపీ నందిరాం నాయక్ అన్నారు.