వేద న్యూస్, ఓరుగల్లు:
వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై లగచర్లలో జరిగిన దాడిని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ ఇచ్చిన ధర్నా పిలుపు మేరకు హనుమకొండ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
దోషులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లగచర్ల ఘటన దారుణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం తరఫున హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం ప్రధాన కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎం.డి రఫీ, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.