- బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి సతీమణి పుష్పలత
వేద న్యూస్, సుల్తానాబాద్:
బీఆర్ఎస్‌కు కార్యకర్తలే బలమని ఆ పార్టీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి సతీమణి పుష్పలత అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మున్సిపాలిటీ లో4వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ బొట్టు పెట్టి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని జనానికి వివరించారు. రాష్ట్రంలో రాబోయేది గులాబీ పార్టీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.