వేద న్యూస్, శాయంపేట :
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శాయంపేట మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమనికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా కో కన్వీనర్ పొడి శెట్టి గణేష్ హాజరై మాట్లాడుతూ ఈ నెల 19వ తేదిన జరగబోయే చలో మానుకోట తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధనకై ఏర్పాటు చేసిన ఉద్యమకారుల యాత్ర మండల కేంద్రం నుండి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు తరలిరావాలని పిలుపునిచ్చారు.అనంతరం టియుఎఫ్ మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడే సందర్భం వచ్చింది అని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 250 చదరపు గజాల ఇంటి స్థలం, ప్రతినెల 25 వేల రూపాయల గౌరవ వేతనం అమలు చేసే దిశగా కృషి చేయాలని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాసరెడ్డి,టియుఎఫ్ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు గిద్దె మారి సురేష్, పల్లె బోయిన సారయ్య, టియుఎఫ్ యూత్ జిల్లా అధ్యక్షుడు కొమ్ముల శివ, మండల కోశాధికారి కానుగుల నాగరాజు, వనం దేవరాజు,తుమ్మ ప్రభాకర్ ,బాసాని సాంబమూర్తి ,నమిత బాజీ అశోక్, అరికెళ్ల వెంకట్, బొంతల నాగరాజు పాల్గొన్నారు.