• బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్

వేద న్యూస్, ఆసిఫాబాద్:
కొమరం భీం అసిఫాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనీ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  శనివారం ఆయన మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా ఉన్నత విద్య విషయంలో చాలా వెనుకబడి ఉందన్నారు.

డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఆ పై చదువులకి ఏ ఒక్క ఉన్నత విధ్యా సంస్థ కూడా లేదు అదే విధంగా జిల్లాలో చాలా వరకు వ్యవసాయం పై ఆధారపడే కుటుంబాలే ఎక్కువ వారి పిల్లలు చదువుకుంటూ కూడా వ్యవసాయం పై ఆసక్తి చూపిస్తారని వివరించారు.

జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంటే ఇక్కడ విద్యార్థులకు వ్యవసాయం పై పూర్తి అవగాహన ఉన్నందువల్ల.. వాళ్లు వ్యవసాయం విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివి వ్యవసాయం లో సాంకేతిక అదునాతన పద్ధతులని నేర్చుకొని ఇక్కడి రైతులకి కొంత వరకు మేలు చేసే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ తీస్కొని కృషి చేయగలరని మనవి చేశారు. సమావేశంలో బీసీ యువజన సంఘం నాయకులు బీర్కూటే ప్రదీప్, కార్తీక్, సందీప్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.