వేద న్యూస్, హన్మకొండ:
జీ తెలుగు నిర్వహించిన ‘సరిగమప’ ఆడిషన్స్ లో హన్మకొండ నయీంనగర్ అల్ఫోర్స్ కళాశాలకు చెందిన 250 మంది విద్యార్థులు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమలలో ముందు ఉండే విధంగా ప్రోత్సహించడంలో తాము ముందుంటామని తెలిపారు.
విద్యార్థుల్లో ఉన్న కళా నైపుణ్యాలు వెలుగు తీయడానికి.. విద్యార్థులను ప్రోత్సహించడంలో విద్యాసంస్థ ముందుంటుందని వెల్లడించారు.
గత ఏడు సంవత్సరాల లో అత్యుత్తమ ర్యాంకులతో పాటు జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలతో పాటు బ్యాడ్మింటన్ విభాగంలో పతకాలు సాధించారని పేర్కొన్నారు. జీ తెలుగు నిర్వహించిన సరిగమప అడిషన్ విభాగానికి పాల్గొన్న విద్యార్థులకు అందరికీ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.