వేద న్యూస్, ఆసిఫాబాద్:
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ బస్ స్టాప్ వద్ద అమ్మవారి ఆశీస్సులతో అర్చకుడు దేవర వినోద్.. రహదారి పైన వెళ్లే ప్రజల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో అంబలి ఏర్పాటు చేశారు.
ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఆయన స్థానికులతో కలిసి ప్రారంభించారు.కార్యక్రమంలో గ్రామస్తులు దుర్గం తిరుపతి, రంగయ్య, మొర్లె నారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.