- పంచాయతి సెక్రటరీ నరేష్ ఆధ్వర్యంలో..
వేద న్యూస్, వరంగల్:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ B.R. అంబేద్కర్ జయంతి పంచాయతీ కార్యదర్శుల ఫోరం హనుమకొండ జిల్లా కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ ఆధ్వర్యంలో దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీ ఆఫీీసులో సోమవారం ఘనంగా నిర్వహించారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి నరేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఫ్రూట్స్ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3 ఆధారంగానే తెలంగాణ వంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం ఏర్పడిందని వివరించారు.
హక్కుల ప్రదాత గా నిలుస్తున్న భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించి ఇచ్చారని పేర్కొన్నారు. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అభిప్రాయపడ్డారు. “బోధించు సమీకరించు పోరాడు” అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వెల్లడించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు Dr. పోరండ్ల ప్రభాకర్.. భారత రాజ్యాంగం, భూ భారతి కి సంబంధించిన పుస్తకములను పంచాయతీ కార్యదర్శికి అందించారు.
కార్యక్రమంలో గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు దామెర శంకర్,కేతిపెళ్లి శ్రీధర్ రెడ్డి,దుబాసి రాధాక్రిష్ణ,రవీందర్ రెడ్డి,పోరాండ్ల ప్రభాకర్,రాసమల్ల కిరణ్,కిన్నెర రమేష్,కోటేశ్వర,కనుకుంట్ల క్రాంతి , రాజి రెడ్డి,నల్ల రాజు,ఉదయ్,దయాకర్,కుమార్, హరినాధ రావు,ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్, అంగన్వాడీ టీచర్ లక్ష్మీబాయి,ఆశా వర్కర్ రజిత,కారొబార్ శ్రీనివాస్, ఎలక్ట్రీషియన్ శంకర్ సిబ్బంది రమేష్,సబిత,తదితరులు పాల్గొన్నారు.