వేద న్యూస్, జమ్మికుంట:

 జమ్మికుంట టౌన్, రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏ ఐ ఆర్ ఆర్ ఎఫ్) జమ్మికుంట బ్రాంచ్ కార్యాలయంలో బ్రాంచ్ అధ్యక్షులు దాసరి రాజేశ్వర్ అధ్యక్షతన ఆదివారం అంబేడ్కర్ పూలే జయంతులను ఘనంగా నిర్వహించారు.

 వేడుకల్లో దాసరి రాజేశ్వర్ మాట్లాడుతూ పూలే, అంబేద్కర్ ఆశయాలను వారి సేవలను కొనియాడారు.  కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఎండి మొయినుద్దీన్, ట్రెజరర్ బి విద్యాసాగర్, ఎండి ఖాదర్ ఖాన్, టి వెంకటస్వామి, డి సారంగపాణి, కొమురయ్య, దేశరాజు పల్లి రాజయ్య, ఎస్ మల్లేశం లతోపాటు సభ్యులందరూ పాల్గొన్నారు.