- జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి
వేద న్యూస్, జమ్మికుంట టౌన్ :
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, హక్కులను అందరికీ ప్రసాదించిన రాజ్యాంగ నిపుణులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి అన్నారు.
ఆయన ఆదివారం జమ్మికుంట అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఆ మహనీయునికి పూలమాలవేసి ఘనంగా కొనియాడారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని అస్తమించని సూర్యునిగా ఆయనను అభివర్ణించారు. ప్రతి వ్యక్తికీ ఈ దేశంలో సంపూర్ణ హక్కులను అందించిన మహనీయుడు.. రాసే వీలున్న అక్షరాలు తక్కువేనని.. మన మధ్య అంబేద్కర్ లేకపోయినా తన జ్ఞాపకాలు మన జీవితాల్లో అతి ముఖ్యమైనవని, ఈ దేశానికి రాజులను తయారు చేసే రాజ్యాంగం అందించిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.
ఈ దేశ ప్రజలకు ఆయన పుట్టిన రోజు ప్రత్యేక శుభాకాంక్షలను వాసు వడ్లూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండలం వల్బాపూర్ గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు మారముళ్ళ కిరణ్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.