వేద న్యూస్, కరీంనగర్:
రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏఐఆర్ఎఫ్) జమ్మికుంట శాఖ నందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 143 వ జయంతి ఉత్సవమును బ్రాంచి సభ్యుల సమక్షమున రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డి రాజేశ్వర్,కార్యదర్శి ఆదేశాల మేరకు మొయినుద్దీన్ ల అనుమతి తో తాప్రా జమ్మికుంట శాఖ అధ్యక్షులు జి చంద్రయ్య అధ్యక్షతన సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేడ్కర్ జీవిత విశేషాలు,విద్య నేర్చుకున్న విధానం ఆయన అనుభవించిన కష్టాలు సాధించిన విజయాల గురించి వివరించారు.
బ్రాంచి కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ మల్లేశం మాట్లాడుతూ అంబేద్కర్ ఉద్యమాలు,రాజ్యాంగ రచన, ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగం లోని కొన్ని విషయాల పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలని మరియు కనీసం రాజ్యాంగ ప్రతిని ప్రతి ఒక్కసారి దగ్గర కలిగి ఉండాలని, ప్రతి భారతీయుడు లింగ వివక్ష లేకుండా విద్యను అభ్యసించాలని,విద్యతోనే అన్ని సాధ్యం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు టి వెంకటస్వామి, ఎండి మోయినుద్దీన్, ఎండి ఖాజా మొయినుద్దీన్, ఎండి ఖాదర్ ఖాన్, ఎస్ రాజయ్య, బి సాంబయ్య లతో పాటు పలువురు రిటైర్ ఉద్యోగులు పాల్గొన్నారు.