వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :
స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అరుదైన శస్త్ర చికిత్సలకు నిలయంగా మిర్యాలగూడ పట్టణంలోని అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ నిలబడుతుంది.పట్టణ పరిధిలోని బుగ్గబాయిగూడెం చెందిన అంజిరెడ్డి(60సం)అనే వ్యక్తి తన టీవీఎస్ పై వెళ్తుండగా ఆగి ఉన్నటువంటి వాహనం ఢీకొనడం జరిగింది.పొట్టలో ఇనుప రాడ్డు తగలడంతో పట్టణంలోని డాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ కు తీసుకురావడం జరిగింది. వైద్యులు సిటీ స్కాన్ నిర్వహించి లోపల రాడ్ తగిలినందువల్ల చిన్న పేగు పగిలిపోవడం,మూత్రనాళము పగిలిపోవడం,లోపల కిడ్నీ మరియు గ్రంధి సంబంధించినటువంటి రక్తనాళాలు దెబ్బతిని రక్తం గడ్డ కట్టి ఉన్నట్లుగా నిర్ధారించి ఈనెల 23వ తేదీ శనివారం సాయంత్రం ఎంతో రిస్క్ తో కూడుకున్నటువంటి మేజర్ సర్జరీ చేయాలనుకోగా లోపల చిన్న పేగు మొదటి భాగం పూర్తిగా దెబ్బతిని రెండు సెంటీమీటర్ల పైబడి రంద్రం పడి ఉండడం,అదే విధంగా మూత్రనాళం దెబ్బతిని పొట్టలోకి మూత్రం లీక్ అవుతున్నట్టుగా గుర్తించారు,లోపల పేగులకి రక్తం అందించే రక్తనాళాలు పగిలి పెద్ద హేమటోమా ఏర్పడి పొట్ట నిండా సుమారు రెండు లీటర్ల పైన రక్తం గుర్తించారు.డాక్టర్ లోకి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి 18 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఎన్నో రకాల గ్యాస్ట్రోఎంటరాలజీ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేసినటువంటి అనుభవంతో వారి యొక్క బృందం దాదాపు రాత్రి మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల పాటు కష్టపడి దిగ్విజయంగా పేగులకు మరియు మూత్రనాళాలకు అత్యాధునిక పద్ధతుల ద్వారా రిపేర్ చేసి పేషెంట్ ప్రాణాల్ని కాపాడారు.అదేవిధంగా లోపల రాడ్డు తగిలిన భాగంలో పొట్టలో కండరాలు పూర్తిగా చెరిగిపోవడంతో వాటిని కూడా రిపేర్ చేయడం జరిగింది.అతనికి వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస ఇవ్వాల్సి వచ్చింది. డాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ లో ఉన్నటువంటి క్రిటికల్ కేర్ ఎక్స్పోర్ట్స్ మరియు ఫిజీషియన్స్ డాక్టర్ పోతిరెడ్డి రామనాథరెడ్డి మరియు డాక్టర్ అనిల్ ల నేతృత్వంలో గత వారం రోజులుగా వారికి వెంటిలేటర్ కేర్ మరియు సెంట్రల్ లైన్ ద్వారా టోటల్ పేరంటం న్యూట్రిషన్ అనగా టీపిఎన్ సహాయంతో వారికి ఆహారం అందించారు.ఇపుడు తాను స్వంతంగా ఆహారం తీసుకుంటున్నారు.
హాస్పిటల్ లో అందుబాటులో ఉన్న సేవలు
మిర్యాలగూడ ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి డా. అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ నందు ప్రత్యేకంగా అన్ని రకాల గ్యాస్ట్రో సర్జరీలు,గ్యాస్ ప్రాబ్లం,గ్యాస్ సంబంధించినటువంటి అన్ని రకాల పేగు సమస్యలు,పేగులు కుల్లటం పేగుల్లో క్యాన్సర్,పేగుల్లో గడ్డలు అన్ని అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ మరియు ఐసియు క్రిటికల్ కేర్,అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ వెంటిలేటర్, డయాలసిస్ ఇటువంటి సౌకర్యాలతో డాక్టర్స్ కాలనీలో అందుబాటులో ఉంది.ఇటువంటి అత్యాధునిక సౌకర్యాలు గల హాస్పిటల్ మిర్యాలగూడ ప్రాంతం మరియు పరిసర ప్రజలకు తెలిసే విధంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క సమాచారాన్ని అందరికీ చేరే విధంగా తమ వంతు ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నామని డాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ తెలియచేశారు.