- అన్నదాతలు దుబ్బాసి మానస – నవీన్ కు భక్తుల అభినందనలు
- ఈ నెల 8న స్వామి వారి కల్యాణ మహోత్సవం
వేద న్యూస్, వరంగల్:
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో ఆ దంపతులు ఏటా అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ నెల 8న శ్రీ దేవి-భూదేవి సమేత చెన్న కేశవ స్వామికళ్యాణ మహోత్సవం ఘనంగా జరపనున్నారు.
శనివారం ఈ ఉత్సవానికి హాజరయ్యే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు అన్నదాన దాతలు దుబాసి మానస నవీన్ గురువారం వెల్లడించారు.
కన్నుల పండుగగా జరిగే చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రజల అధిక సంఖ్యలో ..సకుటుంబ సపరివారం సమేతముగా విచ్చేసి,స్వామి వారి ఆశీర్వాదములు, తీర్థప్రసాదములు స్వీకరించాలని పిలుపునిచ్చారు. స్వామివారికి సేవలో భాగంగా గత తొమ్మిదేళ్లుగా దుబ్బాసి మానస నవీన్ అన్న ప్రసాదం అందిస్తుండటం పట్ల భక్తులు గ్రామస్తులు అభినందిస్తున్నారు. అన్నదానం అన్ని దానాల్లో కెల్లా గొప్పదానమని, అందులో పవిత్రమైన ఆలయంలో స్వామివారి సన్నిధిలో భక్తులకు అన్నప్రసాదం అందించడం గొప్ప విషయం అని పలువురు తెలిపారు. మానస న వీన్ లు పుణ్య దంపతులుగా వర్ధిల్లాలనీ పెద్దలు దీవించారు.
ఈ నెల 8న అంగరంగ వైభవంగా జరగబోయే కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి , ఎంపీవో, స్పెషల్ ఆఫీసర్ నీరు కుళ్ల వద్దుల విమల, పంచాయతీ కార్యదర్శి పెద్దిరెడ్డి జితేందర్ రెడ్డి తదితరులు హాజరవుతారనీ ఆలయ పూజారులు, ఉత్సవ కమిటీ వారు పేర్కొన్నారు.