వేద న్యూస్, వరంగల్:

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో వేపచెట్ల కింద కొలువు దీరిన గణనాథుడి సన్నిధిలో ఆదివారం గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ‘మహాన్నదానం’ ఘనంగా నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు భోళా శంకరుడి తనయుడు విఘ్నేశ్వర మహరాజ్ ను దర్శించుకున్న అనంతరం మహాప్రసాదాన్ని స్వీకరించారు. 

గణేశ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ బాగుండాలని, సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మూషిక వాహనదారుడు, ముల్లోకాలను ఏలే బొజ్జ గణపయ్యను కోరుకున్నట్టు గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.