వేద న్యూస్, వరంగల్:
గణపతి నవరాత్రు లను పురస్కరించుకొని శాయంపేట మండల పరిధిలోని నర్సింహులపల్లి గ్రామంలో చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన మహాన్నదానాన్ని కమిటీ సభ్యులు ప్రారంభించారు.
ఈ సందర్బంగా సభ్యులు మాట్లాడుతూ గణనాథుడి అనుగ్ర హం అందరిపై ఉండాలని, గ్రామస్తులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నాడు.