వేద న్యూస్, వరంగల్ టౌన్ :

సభ్యుల సంక్షేమానికి పరపతి సంఘాలు ఎంతగానో దోహదపడుతాయని గణేష్ పరపతి సంఘం అధ్యక్షుడు నల్ల కోటేశ్వర్ రావు, కార్యదర్శి కొండపాక భాస్కర్ అన్నారు. వరంగల్ కరీమాబాద్ లోని గణేష్ పరపతి సంఘ భవనంలో కోశాధికారి వేముల రాధాకృష్ణ అధ్యక్షతన 20వ వార్షికోత్సవం, సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సంఘం అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధితోపాటు సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కోశాధికారి వార్షిక లావాదేవీలను వివరించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో గతంలో ఉన్నవారినే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.