- ప్రజలకు టీఎస్ఎస్ కళాకారుల పిలుపు
- ఆరు గ్యారంటీలపై సాంస్కృతిక సారథుల ‘కళాజాత’
వేద న్యూస్, వరంగల్:
ప్రజలు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ఎస్ కళాకారులు పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని మూడో డివిజన్ పైడిపల్లి, దేశాయ్ పెట్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అభయ హస్తం ఐదు గ్యారెంటీ పై ‘ప్రజాపాలన’ గ్రామ సభల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొని.. ‘కళాజాత’ ప్రోగ్రాం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు ‘మహా లక్ష్మి’, ‘రైతు భరోసా’, ‘ఇందిరమ్మ ఇళ్లు’, ‘గృహజ్యోతి’, ‘చేయూత’ పథకం పై పాటలు పాడుతూ జనానికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీమ్ లీడర్ జూపాక శివ, రామంచ భరత్, మరుముల్ల ఆనందం, అంకం రామనాథం, హింగె అరవింద్ కుమార్, కందకట్ల రామకృష్ణ, ఎలబోయిన రాజు, మాటేటి అనిత, మేకల విజయ, మైదం ఝాన్సి, జడల హరిత తదితరులు పాల్గొన్నారు.