వేద న్యూస్, జమ్మికుంట :
జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు అధ్యక్షతన మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు.2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,324.74 కోట్లు బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. బడ్జెట్ ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆదాయం మొత్తం రూ.2,324.74 కోట్లు వస్తుందని అంచనా వేశారు. వ్యయంపై మిగులు ఆదాయం రూ.10.62 లక్షలుగా ఉండొచ్చని లెక్కల్లో పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్ పర్సన్, కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ , కౌన్సిలర్లు, మేనేజర్ భూపాల్ రెడ్డి, జేఏవో విమల, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.