- రెండు సంఘ భవనాలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు
- శాసనమండలి సభ్యుడికి ఆరె కులస్తుల కృతజ్ఞతలు
వేద న్యూస్, ఆసిఫాబాద్:
పోరాట యోధుడు, హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఆరాధ్య దైవంగా భావించే ఆరె కులస్తులకు తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ , సిర్పూర్ టీ నియోజక వర్గాల్లో ఎన్నో ఏండ్ల చరిత్ర ఉంది. ఆరె సంక్షేమ సంఘం పేరిట సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని మండల, గ్రామాల్లో శివాజీ మహరాజ్ విగ్రహాలు ఏర్పాటు చేస్తూ.. ఫిబ్రవరి 19 న ఆ మహనీయుని జయంతి వేడుకలను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.
కాాగా, కొన్ని మండలాల్లో ఆరె కుల సంఘ భవనాలు ,స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. విషయాన్ని గమనించిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం, సిర్పూర్ టీ మండలకేంద్రాల్లో భవన నిర్మాణానికి రూ.25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. సిర్పూర్ టీ మండల కేంద్రము లో స్థల వివాదం ఉండగా, దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్సీ దాన్ని పరిష్కరించి.. ఈ నెల 9 న భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
దాదాపు 30 ఏండ్ల సిర్పూర్ టీ మండల ఆరె కులస్థుల కలను నెరవేర్చారు ఎమ్మెల్సీ దండే విఠల్. ఆరె కులస్తులను రాజకీయంగా వాడుకొనే ఈ రోజుల్లో తన వెంట తిప్పుకోకుండా కేవలము ఫోన్ లో చెప్పగానే, సమస్యను పరిష్కరించి దానికి రూ. 25 లక్షలు కేటాయించడం ఎమ్మెల్సీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీకి ఆరె కులస్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ వెంట ఉంటామని పేర్కొన్నారు. సిర్పూర్ టీ లో నిధులు కేటాయించడం లో ఎమ్మెల్సీ దండే విఠల్ తో సన్నిహితంగా మెలిగిన ఎల్ములే కిషోర్, కిర్మరే తరుణ్, చనకపురే శంకర్ ల పాత్ర కీలకమని ఆరె కులస్తులు పలువురు పేర్కొన్నారు.