వేద న్యూస్, వరంగల్:

‘ఆరె తెలంగాణ’ జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ-2025 క్యాలెండర్‌ను ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న, ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపెల్లి శివాజీ మంగళవారం ఆవిష్కరించారు. ఆరె కులస్తుల సంఘటితం కోసం క్యాలెండర్ రూపొందించిన ఆరె తెలంగాణ జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు కోలె దామోదర్ రావును వారు అభినందించారు.

క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా దామోదరరావుకు స్వీట్ తినిపించి నాగుర్ల వెంకన్న శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరె సామాజిక వర్గ ప్రజల చైతన్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

 

సుమారు 8 ఏండ్లుగా ఆరె సామాజిక వర్గ ప్రజలను చైతన్యపరచడం కోసం తన వంతుగా క్యాలెండర్ ప్రతి ఏటా రూపొందించి.. గ్రామగ్రామాన అందజేస్తున్న దామోదర్‌రావును వెంకన్న ప్రత్యేకంగా అభినందించారు. వచ్చే నెలలో సొసైటీ వార్షికోత్సవం ఉందని ఈ సందర్భంగా దామోదరరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు జెండా రాజేశ్, సోమిడి అంజన్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.